online marketing

Thursday, May 17, 2012

చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో..

నెల్లూరు: రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాదు నుండి తిరుపతి విమానంలో వచ్చారు. సినీ నటుడు మోహన్ బాబు కూడా అదే విమానంలో తిరుపతి వచ్చారు. ఇద్దరు ఒకే విమానంలో రావడం విశేషం. అంతేకాదు తిరుపతిలో దిగిన అనంతరం చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం కోసం మోహన్ బాబు సొంత కారులో నెల్లూరుకు వచ్చారు. మోహన్ బాబు మరో కారులో తిరుపతి సమీపంలో తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ కళాశాలకు వెళ్లారు. కావలి వచ్చిన చిరంజీవి మాజీ శాసన సభ్యురాలు మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి ఎవరూ అతీతులు కారని అవినీతి, అక్రమాల కేసులో ఎ-1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఎప్పుడైనా అరెస్టు కాక తప్పదని అన్నారు. నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం కావలిలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకొని పోతుందని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ అనేవారని, ప్రస్తుతం జగన్ విషయంలోను ఇదే జరుగుతోందని చెప్పారు. జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని రోడ్‌ షోలో చిరంజీవి అన్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోడానికి అవసరమైన భద్రత కోసం సిఎం కుర్చీ కావాలని పాకులాడుతున్నాడే తప్ప ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. వైయస్ మరణానంతరం కాంగ్రెస్‌పార్టీని కాపాడాలని సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరితే పట్టెడన్నం పెట్టిన తల్లి లాంటి పార్టీని తన స్వార్థం కోసం కాలదన్ని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్ ప్రయత్నించగా, దాన్ని అడ్డుకోడానికి తాను ప్రయత్నించానన్నారు. కొందరు అధికార దాహంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అంతకుముందు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అన్నారు. పారిశ్రామికవేత్తలను కొందరు స్వార్థపరులు ప్రలోభపెట్టి.. అవినీతిలో కూరుకుపోయేలా చేయడం వల్లే వారు జైళ్లకు పోవాల్సిన పరిస్థితి దాపురించిందని, అందుకు సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్‌లే ఉదాహరణ అని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి రావడానికే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు. ఉప ఎన్నికలలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh