online marketing

Wednesday, May 2, 2012

ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి

నెల్లూరు : పొలాలు, ఆహ్లాదకరమైన, రమణీయమైన ప్రకృతి కనువిందు చేసేది. కాని నేడు నగరం నుంచి 10-15 కిలోమీటర్ల వరకు ఏ వైపుకు వెళ్లినా ప్లాట్లు తప్ప పచ్చటి పొలాలు కనుమరుగైపోయాయి. రైతులకు డబ్బు ఆశ చూపించి వారి వద్ద వున్న పొలాలను ఎకరాలలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా వేసి భూబకాసురులు ఎక్కువ రేట్లకు అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక వేళ వారి వ్యాపారానికి ఈ భూమి సరిపోకుంటే పంచాయతీల భూములను సైతం కబ్జాలు చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు తెలియకుండా సంబంధిత అధికారులతో లాలూచిపడి తమ పనులు చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం నగరంలో స్థలం రేట్లు, ఇళ్ల రేట్లు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ భూబకాసురులే. గ్రామాల్లో కొన్ని చోట్ల పంచాయతీ స్థలాలను ఆక్రమించుకుని వాటిని కూడా ప్లాట్ల రూపంలో మళ్లించేస్తున్నారు. వీరికి ఎక్కడి భూమి కూడా సరిపోదన్నట్టు పేదల భూములను సైతం ఆక్రమించుకుంటున్నారు. గతంలో గ్రామం అంటే పచ్చటి పొలాలు, కోకిల గానాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఆహ్లాదకరంగా ఉండేది. కాని నేడు ఎటు చూచినా రియల్‌ ఎస్టేట్‌...రియల్‌ ఎస్టేట్‌. దీంతో ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి గురవుతున్నారు. హరనాధపురం నుంచి ముత్తుకూరు వరకు వేస్తున్న 4 లైన్ల రహదారి వలన కూడా ఈ రియల్టర్లే ఎక్కువ ఆదాయాలు గడిస్తారని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. 

నెల్లూరు రూరల్‌ మండలమైన ఇరగాళమ్మ దేవస్థానం నుంచి జొన్నవాడ, బుచ్చి మార్గంలో గతంలో ప్రయాణించాలంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఆ మార్గం పొడవునా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని పచ్చటి పొలాల రమణీయ, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించి వెళ్లేవారు. కాలానుగుణంగా ఆ ప్రాంతం మొత్తం ప్లాట్ల రూపంలో మారిపోవడం చాలా విడ్డూరంగా, బాధాకరంగా కనపడుతోంది. రైతులు తాము ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులపాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటున్న తరుణంలో... ఆ పొలాలను తాము కొంటామని ముందుకు వచ్చిన భూబకాసురుల మాటలకు లొంగిపోయి, తమ అప్పులు తీరుతాయని, తమ కష్టాలు గ ట్టెక్కుతాయని భావించి ఆ రైతులు తమ పొలాలను అమ్ముకుంటున్నారు. రైతులకు ఏర్పడిన ఇటువంటి దీనస్థితికి ప్రభుత్వాలే కారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సామాన్యులు ఎవ్వరూ ఇల్లు ట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో ఎటుచూచినా హద్దురాళ్లే కనపడతాయి. రైతులు పంటలు పండించే భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారిపోతే ధాన్యం లేక ఆహార కొరత తీవ్రతరమవుతుంది. అందరి వద్ద డబ్బులున్నా కొనేందుకు ధాన్యం దొరకదు.... తినేందుకు తిండి దొరకదు. ధనదాహంతో భూబకాసురులు సృష్టించిన ఈ కరువులో సమాజంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఊహించేందుకే భయమేస్తోంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh