online marketing

Monday, March 5, 2012

తనపై గౌరవంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని ఆయనను తిరిగి ఎమ్మెల్యే చేయడం తన బాధ్యత..


కోవూరు :డాక్టర్‌ వైఎస్సార్‌ మరణానంతరం రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత పూర్తిగా దిగజారిపోయాయని, రైతుల, పేదల గోడు వినే నాధుడే కరువయ్యాడని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన కొడవలూరులో సోమవారం ఆయన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి బతికుండగా ఆయన పథకాలకు ఆకర్షితుడై ఆయన వద్దకు వచ్చిన ప్రసన్నను రాజీనామా చేసి రమ్మని చెప్పడం జరిగిందన్నారు.తనపై గౌరవంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని ఆయనను తిరిగి ఎమ్మెల్యే చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీలు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే ఉండాలని కోరుకుంటున్నాయని ప్రజలకు ఒకరి మీద బోర్‌ కొట్టినపుడు ఇంకొకరిని గెలిపించుకుంటార నే ఉద్దేశ్యం వారిదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రసన్నను మంచి మెజార్టీతో గెలిపించాలను ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్ధి ప్రసన్న మాట్లాడుతూ జగన్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని తన ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ గాలి ధాటికి మిగతా పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. జగన్‌ చంద్రబాబుకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని, ఆయన ధాటికి చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో టిడిపికి 3వ స్థానం దక్కితే గొప్ప అని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్‌ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటిసి వీరి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh