online marketing

Sunday, March 18, 2012

వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీరి మధ్య ప్రధాన పోటీ..

 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కూడికలు, తీసివేతల్లో నిమగమై ఉన్నారు. ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో పోలింగ్‌ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరి వైపు వెళ్తుందోననేది ఆసక్తికరమైన విషయం.సాధారణంగా 55 నుంచి 60 లేదా బాగా జరిగితే 60 నుంచి 75 శాతం పోలింగ్‌ జరుగుతుంది. ఈ సారి ఉప ఎన్నికల్లో 83.70 శాతం నమోదైంది. దాంతో అందరి అభ్యర్థుల్లోనూ ఉత్కంట, ఒకింత ఆశ మొదలైంది. పెరిగిన ఓట్ల శాతం తమకే అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, సిపిఎం అభ్యర్థిగా జొన్నలగడ్డ వెంకమరాజు, వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉన్నారు. వీరి మధ్య ప్రధాన పోటీ జరిగింది. టిడిపి, సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి అనుకున్న స్థాయిలో చేయలేదు. నేతలు ఎక్కువ భాగం ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెనుకబడ్డారు. తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల అగ్రనేతలు బాగానే ప్రచారం చేశారు. వై.ఎస్‌.జగన్‌ అయితే తానే అభ్యర్థి లాగా ప్రచారం చేశారు. దాదాపు తొమ్మిది రోజులు నియోజకవర్గంలో కాలికి బలం కట్టుకుని తిరిగారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సి అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టిడిపి అభ్యర్థి కొత్త. బూర్జువా పార్టీ అభ్యర్థులు తమ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నానా గడ్డికరిచారనే విమర్శలున్నాయి. సీసాల సీసాల మద్యాన్ని పారించారు. కోట్ల రూపాయల డబ్బును పంచారు. తొలుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓటుకు రూ. 200 లెక్కన గ్రామాల్లో పంచారు. ఎక్కువ మంది ఓటర్లు ఓటుకు రెండు వేల రూపాయల వంతున ఇస్తారని ఊహించారు. అందుకు భిన్నంగా ఆ పార్టీ వారు రూ.200 మాత్రమే ఇచ్చింది. దాంతో ఓటర్లలో కొంత అసంతృప్తి నెలకొంది. అలాగేటిడిపి కొన్ని మత్స్యకార గ్రామాల్లో దురాయి వేయించుకుని ఓట్లు వేయించుకుంది. గ్రామాల్లో గుళ్లూ, గోపరాలూ కట్టించేందుకు డబ్బులు పందేరం చేసింది. అంతేగాక ఓటుకు రూ. 500 చొప్పున ఇచ్చారు. తొలి నుంచీ మందకొడిగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌అభ్యర్థి మూడో స్థానంలో నిలుస్తారని ప్రచారం జరిగింది. పోలింగ్‌ సమీపస్తున్న రెండ్రోజుల ముందు ఆయన తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎంపిక చేసిన సుమారు లక్ష ఓటర్లకు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచారు. అంతేగాక వారితో ఒట్టు కూడా వేయించుకున్నారు. దాంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఓటింగ్‌ సమీకరణలు మారిపోయాయి. ఎంపిక చేసిన ఓటర్లకే వెయ్యి రూపాయలివ్వడంతో మిగతా ఓటర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానిని పసిగట్టిన పోలంరెడ్డి పోలింగ్‌ రోజు కూడా ఓటేయకుండా స్లిప్పు చూపించిన ప్రతి ఓటరుకూ వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలింగ్‌ 83.70 శాతానికి పెరిగింది. మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పోలింగ్‌లో ఉన్నారు. పెరిగిన ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సెంటిమెంట్‌తో ఓట్ల శాతం పెరిగిందా డబ్బు పంపకాల వల్లా అనే చర్చ సాగుతోంది. అందుకు తెరదించాలంటే ఈనెల 21వ తేదీ దాకా ఆగాల్సిందే.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh