online marketing

Sunday, March 4, 2012

మేకపాటి సోదరులపై అనర్హత వేటు వేయటంతో ఉదయగిరి రాజకీయాలు ఒక్కసారిగా


ఉదయగిరి : నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా, స్థానిక శాసనసభ్యుడిగా పోలీచేసి గెలుపొందిన మేకపాటి సోదరులపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒకటి, రెండు రోజుల్లో వెనువెంటనే అనర్హత వేటు వేయటంతో ఉదయగిరి రాజకీయాలు ఒక్కసారిగా రూపుమారాయి. ఉదయగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందిన ఉదయగిరి శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి పార్టీని వీడకుండానే వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆగ్రహించిన అధిష్టానం మేకపాటిపై వేటుకు అనర్హత వేటు వేసింది.

1994 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మేకపాటి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికి, అధిష్టానం మాజీ మంత్రి మాదాల జానకిరాం పేరును ప్రకటించడంతో , ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి, తెలుగుదేశం మద్దతుతో రంగంలోకి దిగిన మాజీ శాసనసభ్యుడు కంభం విజయరామిరెడ్డి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ,కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మాదాల జానకిరాంను ఓడించడంలో మేకపాటి క్రియాశీలక పాత్ర పోషించాడు. 1999 వ సంవత్సరంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటిని ఓడించటానికి మాదాల తెలుగుదేశం అభ్యర్ధి కంభం విజయరామిరెడ్డికి మద్దతు ఇవ్వటంతో మేకపాటికి ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004 వ సంవత్సరంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి కంభంపై గెలుపొందారు. అలాగే 2009 సంవత్సరంలో కూడా కంభంపై మేకపాటి గెలుపొంది రెండవసారి ఉదయగిరి శాసనసభ్యుని గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ వరుసగా 3 సార్లు మేకపాటికి ఉదయగిరి నుంచి టికెట్‌ ఇవ్వగా 2 సార్లు గెలుపొందడం విశేషం.

అయితే 2 వసారి గెలుపొందిన 2 సంవత్సరాలు మాత్రమే చురుకుగా పాల్గొని, స్వర్గీయ ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశుఖర్‌రెడ్డి మృతిచెందిన అనంతరం జగన్‌ను ముఖ్యమంత్రిగా అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన శేఖర్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ పేరును యఫ్‌,ఐ.ఆర్‌.లో నమోదు చేశారనే నెపంతో కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యేందుకు దారులు వెదకడం ప్రారంభించారు. కాంగ్రెస్‌ శాసన సభ్యుడుగా గెలుపొందిన మేకపాటి శాసన సభ్యుడిగా రాజీనామా చేయకుండానే వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురకుగా పాల్గొనడమే కాకుండా అధిష్లానానికి వ్యతిరేకంగా జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రను విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లాలో కీలకపాత్ర పోషించారు.అలాగే కాంగ్రెస్‌ పార్టీపై తెలుగుదేశం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి , కాంగ్రెస్‌పార్టీకి తీరని ద్రోహం చేశారని, అప్పటి కాంగ్రెస్‌ విప్‌ కొండ్రు మురళి మేకపాటిపై పార్టీ అనర్హత వేటువేయాలని స్పీకర్‌ను ఒత్తిడి చేశారు.అనంతరం స్పీకర్‌ కూడా వ్యక్తిగత విచారణలు పూర్తికావడంతో రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షులు బొత్స సత్యనారాయణ , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీఆజాద్‌ పిలుపు మేరకు గురువారం తుది నివేదిక ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళి 16మంది కాంగ్రెస్‌ పార్టీ ధిక్కార శాసన సభ్యులలో వేటు వేయించటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అధిష్టానం అనర్హత వేటు వేసిన వారిలో మేకపాటి మొదటి వరుసలో ఉండటం విశేషం..ఇప్పటికే స్థానికశాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి స్వయానా సోదరుడు, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో అటూ నెల్లూరు పార్లమెంటు సభ్యుడుగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఇటూ శాసనసభ్యుడుగా మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై ఒకేసారి వేటు వేటు వేయటంతో ఉదయగిరిలో రాజకీయ వేడి ఒక్కసారిగా వేడెక్కింది.

ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు అభ్యర్ధిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభ అభ్యర్ధిగా మేకపాటి చంద్రశేఖరరెడ్డిల పేర్లు ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఉదయగిరి అభ్యర్దిగా బొల్లినేని వెంకరామారావు పేరును అంగీకరించింది. కానీ అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పార్లమెంటు . అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ఎది ఎమైనా ఉదయగిరి అభ్యర్ధుల బట్టే నెల్లూరు పార్లమెంటు అభ్యర్దుల భవిత్యవంపై ఆదారపడివుంది

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh