online marketing

Tuesday, February 14, 2012

సుఖ పడటమంటేనే శృంగారం అన్న భావన .

"ధర్మేచా... అర్థేచా... కామేచా... మోక్షేచా... నాతి చరామి'' అంటూ పురోహితుడు అగ్ని సాక్షిగా వధూవరులతో ప్రమాణం చేయిస్తాడు. ధర్మం, సంపాదన, సంసారం, అన్ని విధాల నేను నీకు తోడు, నీడగా ఉంటానని దీనర్థం. పెళ్లినాటి ప్రమాణాలలో అతిముఖ్యమైన నాతిచరామికి నేడు తిలోదకాలిస్తున్నారు. సమాజంలో నెలకొన్న ఆధునిక పోకడలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సుఖపడటం అంటే శృంగారం అనే భావన నెలకుంటోంది. 

దీంతో మానవీయ విలువలు పడిపోతున్నాయి. దారితప్పిన వివాహితలు హతమవుతున్నారు. ప్రియు డితో కలిసి భర్తనూ చంపేసే ఇల్లాలు ఉన్నారు. అనుమానపు మగాళ్లు అమాయకపు ఆడపడుచులను తుదము ట్టిస్తున్నారు. ఇలా జిల్లాలో ఏటా 200 మంది బలి అవుతున్నట్లు పోలీసు రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఇక పోలీసుస్టేషన్లకు చేరని ఫిర్యాదులు ఇందుకు రెట్టింపుగా ఉన్నాయి.

జల్సాలకు అలవాటు పడి.. గతంలో మన సం స్కృతి, సంప్రదాయాల కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. పాశ్చాత్య పోకడలు పెరిగిపోవడం తో పేదల నుంచి సంప న్న వర్గాల వరకు రోజువారి అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డ్రస్ కోడ్‌లో పెనుమార్పులు వచ్చాయి. శరీరమంతా కనిపించేలా దుస్తులు ధరించడం నేటి ఫ్యాషన్‌గా మారిపోయింది. అంతేగాక చేతిలో సెల్‌ఫోన్‌తో బిజిబిజీగా గడుపుతూ రోజు మద్యం సేవించడం నిత్యకృత్యమయ్యాయి. ఇవన్నీ కావాలంటే డబ్బు అవసరం పెరిగిపోయింది. దీనికోసం చేయని అక్రమాలు లేవు. రోజు వారి సంపాదన తాగుడికే తగలేస్తున్న వారు కోకొల్లలు. మరోవైపు సుఖ పడటమంటేనే శృంగారం అన్న భావన అధికంగా ఉంది. దీంతో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఈ శృంగారం విచ్చలవిడిగా సాగుతోంది. ఇది ముదిరి హత్యలకు కారణాలు అవుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్నారు. ఇక అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాల సంఖ్య పెచ్చుమీరుతున్నాయి. కన్నెపిల్లలే తల్లులవుతూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. మన చుట్టూ విస్తరించిన విష సంస్కృతే ఇందుకు ప్రధాన కారణమైంది.

ఏటా 200 మందిపైగానే.. జిల్లాలో 2010లో 68 హత్యకేసులు పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో 55 కేసులు అత్యాచారానికి చెందినవే. ఇక ఆత్మహత్యలు 148 పోలీసు రికార్డుల్లోకి ఎక్కాయి. 2011లో హత్య కేసులు 52 రిజిస్టర్ కాగా, వీటిలో 40 వరకు అత్యాచారానికి సంబంధించినవే. ఆత్మహత్యలు 156 వరకు ఉన్నాయి. గ్రామస్థాయిలో మధ్యవర్తుల రాజీలో మరుగున పడినవి మకెన్నో ఉన్నాయి. అంటే ప్రతి ఏడాది హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు బలైన వారు సరాసరిన 200 మంది వరకు ఉన్నారు. ఇవిగాక పోలీసుస్టేషన్ల గడప ఎక్కని కేసులు రెట్టింపుగానే ఉంటాయన్నది సమాచారం. కోర్టులో తీర్పురాని కేసులూ కొకొల్లలుగా ఉన్నాయి. మారుతున్న సమాజం తోపాటు ప్రజల్లో చైత న్యం తీసుకురావాల్సిన అవసరం ప్రజా సంఘా లు, ప్రభుత్వంపై ఉంది. చెడు వ్యసనాలు, దుర అలవాట్లపై అవగాహన కల్పిస్తే కొంత వరకు ఇలాంటి నేరాలను అరికట్టవచ్చు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh