online marketing

Friday, February 3, 2012

అమ్మా.. నీకెందుకింత కష్టం.. ఈ వయసులో కూలి పనులు చేయాలా..

సంగం  : " అమ్మా.. నీకెందుకింత కష్టం.. ఈ వయసులో కూలి పనులు చేయాలా.. నిన్ను చూసుకునేవారు లేరా?. పింఛను అందుతోందా.. తెల్లరేషన్‌కార్డు ఉందా.. ఎన్నికేజీల బియ్యం ఇస్తున్నారు?'' అంటూ ఓ వృద్ధురాలితో కలెక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం ఉదయం సంగం మండలం గాంధీజనసంఘంలో 'ఉపాధి' పథకం ద్వారా జరుగుతున్న కాలువపూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొలం గెనాల మీద నడిచి కూలీల వద్దకు వెళ్లారు. పొలం పనిలో నిమగ్నమై ఉన్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. "ఏమ్మా నేనెవరో నీకు తెలుసా'' అన్ని ప్రశ్నించారు.

దీంతో ఆ వృద్ధురాలు "తెలియదయ్యా..''అని సమాధానం ఇచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న అధికారులు 'ఈయన కలెక్టర్' అని చెప్పడంతో ఆమె "నమస్కారమయ్యా'' అంటూ కలెక్టర్ వద్దకు వచ్చింది. దీంతో ఆయన "ఏమ్మా నీకెందుకు ఇంత కష్టము.. పిల్లలు లేరా?'' అని ఆ వృద్ధురాలితో సంభాషించారు. "ఉన్నారు నా యనా..వారు వేరే కాపురం పెట్టుకున్నారు.. నేను ఒక్కదాన్నే ఉన్నా.. కూలి పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నా'' అని సమాధానం చె ప్పారు. వృద్ధురాలితోపాటు అక్కడున్న వారితో క లెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ యుగంధర్, డీపీఆర్‌వో కమలాకర్‌రెడ్డి, ఎమ్పీడీ వో జేవీ రమణయ్య, ఏపీవో మీరయ్య ఉన్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh