online marketing

Wednesday, February 15, 2012

సినిమా ఫక్కి లో కొందరు దుండగులు పట్ట పగలు కత్తులతో బెదిరించి..

నెల్లూరు : సినిమా ఫక్కి లో నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో కొందరు దుండగులు బుధవారం పట్ట పగలు కత్తులతో బెదిరించి ఓ వ్యాపారి నుంచి రూ. 78వేలు దోచుకుని వెళ్లాడు. నాల్గో నగర ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు. నెల్లూరు లేక్‌వ్యూ కాలనీకి చెందిన కొండయ్య స్టోన్‌హౌస్‌పేటలో మిరపకాయల వ్యాపారం చేస్తున్నాడు.

నిత్యం ఏదో ఒక ఆటోలో ప్రయాణిస్తాడు. బుధవారం ఇంటికి వెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండులో ఆటో ఎక్కాడు. ఆటో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి ఆటోలో వీఆర్సీ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోను ముత్తుకూరు బస్టాండు వైపునకు మళ్లించి మినీ బైపాస్‌లోకి తిప్పారు. ఇదేమిటని కొండయ్య ప్రశ్నిస్తే, పోలీసుల తనిఖీలు జరుగుతు న్నాయని నమ్మబలికారు. మినీ బైపాస్‌లో టీడీపీ కార్యాలయం సమీపంలోని ఖాళీస్థలాల్లోకి ఆటోను మళ్లించాడు. డ్రైవర్, మరోవ్యక్తి కలసి కొండయ్యను కత్తులతో బెదిరించారు. అతని దగ్గరున్న రూ. 78వేలు లాక్కుని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు నాల్గో నగర పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh