online marketing

Monday, February 13, 2012

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా?

నె ల్లూరును మహా నగరం గా మార్చేందుకు చుట్టుపక్కల ఉన్న పంచాయతీలను విలీనం చేయాలని పాలకులు భావించారు. ఈ క్రమంలో ఇంతవరకు విలీనంపై జీవో జారీ కాలే దు. దీనికితోడు గ్రామాలు విలీనమె ౖతే రానున్న ఎన్నికల్లో గెలుపు సా« ద్యంకాదేమోనన్న ఉద్దేశంతో అధికారపార్టీ నేతలు వెనుకడుగు వేస్తున్న ట్లు తెలిసింది.

ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశా రు. తాజాగా బీసీ గణనను ప్రారంభించారు.

హడావుడి మొదలైనా.. మేలో పురపాలక సంఘాలకు ఎ న్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో పురపాలక సంఘాలలో ఎన్నికల హడావుడి మొదలైంది. నెల్లూరులో కలవాల్సిన 15 పంచాయతీల విలీనంపై జీవో ఇంతవరకు జారీ కాలేదు. కొత్త గా ఏర్పాటైన ఆ త్మకూరు, సూళ్లూరుపేట పురపాలక సంఘాలకు వార్డుల ఏర్పాటు ప్రక్రియను ప్రా రంభించారు. దీంతో కొత్త వాటితోపాటు పాత ము న్సిపాలిటీలలోనూ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నెల్లూరు నగర పాలక సంస్థలో మాత్రం పరిస్థితి ఇం దుకు భిన్నంగా ఉంది. కార్పొరేషన్‌లో గ్రామాల వి లీనానికి సంబంధించి జీవో జారీ కాకపోవడమే ఇం దుకు కారణం. పురపాలక సంఘాలన్నింటికి ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తామని ము న్సిపల్ మంత్రి పేర్కొనడంతో నగర నేతల్లోనూ ఆశలు రేగాయి. ఏడాదికిపైగా పురపాలక సంఘాలకు పాలక వర్గా లు లేక, ద్వితీయ స్థాయి నేత లు రాజకీయ నిరుద్యోలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం వారిలో ఆనం దం వ్యక్తమవుతోంది.

విలీనం జరిగేనా? జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఇప్పటికే ఐదు ల క్షల జనాభా ఉంది. 50 డివిజన్‌లు ఉన్నాయి. మరో 15 పంచాయతీల విలీనానికి గతంలోనే రంగం సిద్ధం చేశారు. న గరానికి చుట్టూ ఆరేడు కిలో మీ టర్ల పరిధిలో ఉన్న నవలాకులతోట, బిట్  పం చాయతీ, చింతారెడ్డిపాళెం రాజుపాళెం, వావిలేటిపాడు, గుండ్లపాళెం  వడ్డిపాళెం, కనుపర్తిపాడు, కల్లూరుపల్లి  హౌసింగ్‌బోర్డు కాలనీ, బుజబుజనెల్లూరు, కొత్తూ రు, అంబాపురం, పొట్టేపాళెం, అల్లీపురం, కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, గుడిపల్లిపాడు, పెద్ద చెరుకూరు పంచాయతీలను నగర పాలక సంస్థలో కలిపేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. కార్పొరేషన్‌లో కలిపేందుకు గతంలో పంచాయతీల పాలకులు అంగీకరించలే దు. దీంతో విలీన ప్రక్రియకు ఆలస్యమవుతూ వ చ్చింది. పంచాయతీ పాలకవర్గాలు రద్దు కావడం స్పెషల్ అధికారుల పాలన ఏర్పడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. జీవో జారీ కాకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా..?లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలు జరగాలంటే... కార్పొరేషన్ ఎన్నికలు జరగాలంటే గ్రామాల విలీనంతో పనిలేకుండా పాత డివిజన్‌లకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గ్రామాల విలీనాన్ని దా దాపుగా పూర్తి చేయ డం, మున్సిపల్ శాఖ ఆమోద ముద్ర లభించడందో కొత్త గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జీవో జారీ కానందున పంచాయతీలను పక్కన పెట్టి పాత డివిజన్‌లకే ఎన్నికలు నిర్వహిస్తే మరో ఐదేళ్లపాటు పంచాయతీలు నగర పాలక సంస్థలో విలీనమ య్యే అవకాశం లేదు. వాటి ని కార్పొరేషన్‌లో కలిపేందుకు దాదాపుగా ప్రక్రియను పూర్తి చేయడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు. దీంతో వాటిని నగర పాలక సంస్థలో కలిపి మొత్తానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటోంది. జీవో జారీ మాత్రమే మిగిలి ఉండడంతో కొత్త పంచాయతీలతో కలిపి ఎన్నికలు జరుగుతాయని అటు అధికారులు, ఇటు రాజకీయ పార్టీల నేతలు భావిస్తున్నారు.

పాలకులపై ఆరోపణలు నగర పాలక సంస్థ ఎన్నికలను అ డ్డుకునేందుకు గ్రామాల విలీనాన్ని అధికార పార్టీ నేతలు పావుగా వా డుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. జీవో జారీకి ఎటువంటి అడ్డంకులు లే కపోయి నా ఆలస్యమవుతుండడంపై అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. ము న్సిపల్ ఎన్నికలు కాం గ్రెస్‌కు అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో నగర పాలక సంస్థ ఎన్నికలను అ డ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ఆత్మకూరు, సూళ్లూరుపేట పురపాలక సంఘాలకు సం బంధించి గ్రామాల విలీనం ఎన్నికల ప్రక్రియ ప్రా రంభం కాగా, నగరంలో కాకపోవడాన్ని వాళ్లు ఉ దాహరణగా చెబుతున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించలేమన్న భయంతోనే ఎన్నికలను వాయిదా వేయించాలని పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇం దుకోసం గ్రామాల విలీనం జీవో మంజూరు కావ డం లేదని వారు అంటున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh