online marketing

Sunday, August 28, 2011

వీడియో కాన్ఫరెన్సా...అయితే ప్రక్క జిల్లాకు పోవాల్సిందే!

నెల్లూరు  : పరిపాలనలో భాగంగా జిల్లా అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఆయా విభాగాల కమిషనర్లు, కార్యదర్శులతో మాట్లాడడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ సేవలు ఎపి స్వాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసారు. అత్యవసర సమావేశాలు, తుఫాను వంటి సమయాల్లో ఈ సదుపాయం ద్వారా వేగవంతంగా అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది.

అయితే కలెక్టరేట్‌లోని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రంలో ఏదో ఒక సాంకేతిక లోపంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు దాదాపు 10 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ఈ కేంద్రంలో క్లిష్ట సమయాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించాల్సిన సమయాల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రక్క జిల్లాలకు వెళ్ళ వలసి వస్తుంది. శుక్రవారం ఇటువంటి సందర్భాన్నే అధికారులు చవిచూసారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒంగోలుకు వెళ్ళవలసి వచ్చింది.

మండలాల్లో అనుసంధానం కాని వీడియో కాన్ఫరెన్స్‌
వేగవంతమైన, సుపరిపాలన అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2009లో 23 జిల్లాలకు, 1088మండలాలకు, 5690 ప్రభుత్వ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించడానికి రూ.140 కోట్లు కేటాయించారు. హైదరాబాదు నుండి జిల్లా కేంద్రాలకు 8 ఎంబిపియస్‌, జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు 2 ఎంబిపియస్‌ వేగంతో ఇటువంటి సదుపాయం కల్పించాలని సంకల్పించారు. కానీ, మండలాల్లో ఈ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగ్గా లేనప్పుడు మండలాల్లో ఎట్లా ఉంటుందోనని కొందరు అధికారులు విమర్శిస్తున్నారు.
మండలాల్లో ఇంకా టెండర్లు పిలపలేదు - రమణయ్య, ఎపి స్వాన్‌ జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలనే నిర్ణయం నిజమే. కానీ మండలాల్లో టెండర్లు పిలవలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రక్రియ అసంపూర్తిగా ఉంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh