online marketing

Sunday, August 28, 2011

పగటి ఘరానా దొంగ అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:నగరంలో పట్టపగలు ఇంటికి తాళం వేసివున్నా, వేయకపోయినా అదును చూసి చోరీలకు పాల్పడే ఓ ఘరానా దొంగను సిసిఎస్‌ పోలీసులు గురువారం వేదాయపాళెం రైల్వేస్టేషన్‌లో అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఈ దొంగను మీడియా ముందు ప్రవేశపెట్టి డిఎస్‌పి రవికుమార్‌ వివరాలను తెలియజేశారు. నగరంలోని డైకస్‌రోడ్డు ఎన్‌బిటి కాలనీకి చెందిన ఎస్‌డి.సూద్‌ అనే యువకుడు వృత్తిరీత్యా బంగారు పనిచేస్తూ, ప్రవృత్తి రీత్యా చోరీలకు పాల్పడుతూ నగరంలోని ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించాడని నగర ఇన్‌చార్జ్‌ డిఎస్‌పి రవికుమార్‌ తెలిపారు. నగరంలోని బివి.నగర్‌, జగజ్జీవన్‌రాంనగర్‌, గాదం రోశయ్యనగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ వంటి పలు ప్రాంతాలలో గత నెలరోజులుగా చోరీలకు పాల్పడుతూ ఇంటి తాళాలు బద్దలుకొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ దొంగ వద్ద నుంచి మొత్తం రూ.3 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పగటి దొంగను పట్టుకోవడంతో సిసిఎస్‌ సిఐ సురేష్‌కుమార్‌, 3వ, 5వ నగర క్రైం ఎస్‌ఐలు బాబురావు, కృష్ణయ్యలు, క్రైం కానిస్టేబుళ్లు రవిచంద్రకుమార్‌, సిరాజ్‌, శిఖామణి, వెంకటేశ్వర్లు చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. వీరిని జిల్లా ఎస్‌పి బివి.రమణకుమార్‌ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh