online marketing

Wednesday, May 4, 2011

ఎర్రచందనం దుంగలు పట్టుకున్న పోలీసులు

కలువాయి: మండల కేంద్రమైన కలువాయి అంకమ్మమాను రచ్చ సమీపంలో పాడుపడ్డబావిలో దాచి ఉన్న ఎర్రచందనం దుంగలను కలువాయి పోలీసులు ఫోన్‌ సమాచారం మేరకు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ స్మగ్లర్లు అడవి ప్రాంతంలో కొట్టుకుని వచ్చిన ఈ దుంగలను ద్విచక్రవాహనాలపై తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో బావిలో డంపింగ్‌ చేయడం జరిగిందన్నారు.ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బావిలో దిగిచూడగా రూ.50వేలు విలువగల తొమ్మిది ఎర్రచందనం దుంగలను బావిలో డంప్‌ చేసినట్లు వారు తెలిపారు. ఈ దుంగలను కలువాయి పోలీస్టేషన్‌కు తరలించారు.

తీరా చూస్తే ఈ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు ఉన్నారా లేదా తెలియడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారంటే అవి పోలీసులు మాత్రమే పట్టుకోవడం జరుగుతుందని మండల ప్రజలు ఆనోట ఈనోట అనుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఫారెస్ట్‌ అధికారులు స్మగ్లర్ల ఆమ్యామ్మలకు లొంగినట్లు కనిపిస్తున్నట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రసూల్‌ఖాన్‌, పోలీస్‌ సిబ్బంది వంశీధర్‌రెడ్డి, బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ సాంబశివరావులు ఉన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh