online marketing

Friday, April 22, 2011

ఫలించిన చెంగాళమ్మ సెంటిమెంటు

సూళ్ళూరుపేట: శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సెంటిమెంటు ప్రభావం ఏమాత్రం తగ్గలేదనడానికి నిదర్శనం బుధవారంనాటి రాకెట్‌ ప్రయోగమే. వివరాలు పరిశీలిస్తే శ్రీహరికోటలో గత కొంతకాలంగా రాకెట్‌ య్రోగానికి ముందు ఇస్రో చైర్మన్‌లు సూళ్ళూరుపేటలో ఉన్న శ్రీచెంగాళమాతా పరమేశ్వరీ దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించదం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత ఏడాది చైర్మన్‌గా భాద్యతలు తీసుకున్న ప్రస్తుత చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ మాత్రం ఆనవాయితీని మార్చి నేరుగా రాకెట్‌ ప్రయోగం జరిపారు. గత ఏడాది భారీ వైపల్యాలను ఇస్రో చవిచూసింది. విషయాన్ని గ్రహించారో లేక ఎవరైనా చెవిలో వేశారోగాని ఈ ప్రయోగానికి ముందు రోజు సతీ సమేతంగా వచ్చి అమ్మణ్ణికి పూజలు చేసి వెళ్లారు చైర్మన్‌. శాస్త్రానికి దైవ బలంతోడవడంతో బుధవారం ఉదయం 10.12 కి ప్రయోగించిన పి.ఎస్‌.యల్‌.వి. సి16 రాకెట్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని అతి ఖచ్చితంగా చేరుకుని సెంటిమెంటుకు బలాన్ని చేకూర్చింది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh