online marketing

Wednesday, April 20, 2011

ఊరు... మనదే.... ఎవడొస్తే... మనకేంటి...!!!?

ఆత్మకూరు, (మేజర్‌న్యూస్‌): ‘ఊరు మనదే. ఎవడొచ్చినా లెక్క చేయాల్సిన పని లేదు. వస్తే వాడేంచేస్తాడో చూసుకుందాం. వింటాడా సరేసరి. లేదా వారి అంతుచూద్దాం...’ ఇదేమిటా అనుకుంటున్నారా అదేనండీ ఇటీవల ఉత్సవాల పేరుతో పల్లెల్లో జరిగే నగ్నప్రదర్శనలపై ఎవరైనా కామెంట్‌ చేస్తే వారికి ఆ ఊరు పెద్దలిచ్చే వార్నింగ్‌ ఇదే మరి...! దీంతో ఎవరైనా ప్రశ్నించేందుకు భయపడుతున్నారు. అధికారులు సైతం వారి బలానికి..., ముడుపులకు దాసోహమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయాలు మంట కలుస్తున్నాయి.

అనంతసాగరం మండలంలోని మినగల్లు, గౌరవరం గ్రామాల్లో విచ్చలవిడిగా ఉత్సవాల ముంగిట నగ్నప్రదర్శన సమాజం సిగ్గుపడేలా జరిగింది. దీన్ని చూసీచూడనట్లు బందోబస్తులో ఉండే పోలీసులు ఉండడం ఓ వింత. అక్కడ లేకపోయినా పర్వాలేదు కానీ బందోబస్తు డ్యూటీలో ఉంటూ మాకేంటిలే అని తెలియనట్లుగా ఓ చోట బజ్జుంటున్నారు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే... అరే అలాగా... మేం నిద్రపోయాం.. అప్పుడు జరిగిందా అంటూ కళ్ళు నలుపుకొంటున్నారు. ఇదంతా వారికి తెలిసి జరిగిందేకదా. ముందుగా అడ్డుకోవడం, కాసేపు అడ్డగించడం తర్వాత వెళ్ళిపోవడం.

ఈ నేపథ్యంలో అశ్లీల నృత్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. యువతులు ఒక్కోక్కటిగా వలువలు విప్పుతు ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ప్రదర్శనకు యువకుల కేరింతలు, డబ్బుబాబుల సంబరాలు అంతాఇంతా కాదు.ఓ డ్రస్‌ విప్పితే ఒక రేటు, ఇలా ఏ మేరకు ఆ డ్యాన్సర్‌ అంగీకరిస్తుందో ఆమె ఒంటి నిండా డబ్బేనని చెప్పవచ్చు. మర్రిపాడు మండలంలో మూడు గ్రామాల్లో ఈ ప్రదర్శనలు ఔరా అనిపిస్తాయి.ఇక్కడ నగ్ననృత్యాలను తిలకించేందుకు బద్వేలు నుంచి సైతం యువకులు ద్విచక్రవాహనాలపై వస్తారంటే అక్కడ పరిస్థితి ఏ మేరకు ఉంటుందో చెప్పక్కరలేదు. ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో సైతం నగ్నప్రదర్శనలు జరుగుతున్నా అంతా సద్దుమణిగాకే వలువలు విప్పడం జరుగుతుంది.

అక్కడ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా వారి పని అంతే. వాళ్ళ సొంతగ్రామం కావడం, కాస్తో కూస్తో నేతల అండదండలు ఉండడం, ఆర్థిక బలం అధికంగా ఉండడంతో ఇష్టారాజ్యమేలుతున్నారు. భక్తిశ్రద్ధలతో జరిగే ఉత్సవాలకు అశ్లీలత తోడై ఆ వాతావరణం జుగుత్సాకరంగా తయారవుతుంది. పోలీసుయంత్రాంగం నిద్రావస్థలో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మహిళ లోకానికి మచ్చతెచ్చే ఇలాంటి ప్రదర్శనలపై తగు చర్యలు చేపట్టాలి. యువత పెడద్రోవ పట్టకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలి

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh