online marketing

Thursday, March 24, 2011

టెన్త్‌ పరీక్ష రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి


నెల్లూరు:పరీక్షలు ప్రారంభమైన రోజునే ఇంజనీరింగ్‌ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాయడం పలువురిని ఆశ్చర్య పరచింది. నగరంలోని వేదసంస్కృత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రం (4355)లో గురువారం తెలుగు పేపర్‌-1ను రాయాల్సిన ఎస్‌కె.ఖలీం హాల్‌టికెట్‌ నెం. 1117200131 ప్రైవేట్‌ విద్యార్థికి బదులు క్యూబా ఇంజనీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్‌కె.ముహిసీన్‌ పరీక్ష రాశాడు. నాటకీయంగా బయట పడిన ఈ విషయం అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ముగిసే సమయంలో హాల్‌టిె ట్‌పై ఉన్న ఫోటోను, పరీక్ష రాస్తున్న అభ్యర్థిని పరిశీలించి నకిలీ అభ్యర్థిని పట్టుకున్నామని ఇన్విజిలేటర్‌ చెబుతున్నాడు. 

ఈ ఇన్విజిలేటర్‌ గత ఏడాది కూడా ఇదే పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించడం గమనార్హం. అయితే పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి ఎలా పట్టుపడ్డాడో అన్న అంశంపై విభిన్న సమాధానాలు వెలువడ్డాయి.పరీక్ష కేంద్రానికి బయట తచ్చాడుతుంటే పట్టుకున్నారని కొందరు, ఈ విధంగా పరీక్ష రాస్తే ఏం కాదుగదా అని ఆ విద్యార్థి అడుగుతుంటే పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారని చెబుతున్నారు.అయితే పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్‌ హాల్‌టిక్కెట్లను పరిశీలించి అభ్యర్థుల ఫోటోలు, నెంబర్లతో సరిచూసుకుని సమాధాన పత్రాలపై సంతకం పెట్టాల్సిన సమయంలో ఇన్విజిలేటర్‌ ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు మరింత తావిస్తోంది.

పరీక్ష ముగిసే సమయంలో గమనించడానికి గల కారణాలు సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్‌ వద్ద లేవు. ముత్తుకూరు జడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన కె.శేఖర్‌ ఈ విషయాన్ని ఛీఫ్‌ సూపరింటెండెంట్‌కు తెలపడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పోలీసులకు విద్యార్థులను అప్పగించడం జరిగింది. అయితే పదవ తరగతి ప్రైవేట్‌ విద్యార్థులు అప్లికేషన్‌ (ఐసి ఫారాల్లో) భారీ జాగ్రత్తలతో విద్యార్థుల నుండి తీసుకుంటారు. హాల్‌ టిక్కెట్లు ఇచ్చే సమయంలో కూడా హాల్‌ టిక్కెట్‌ వెనుక సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరాలను సరిచూసి ధృవీకరణ చేస్తారు. ఒక విద్యార్థి పరీ కు హాజరయ్యే సమయంలో ఇన్విజిలేటర్‌ వివరాలను, ఫోటోలను సరిచూసుకుని ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందజేస్తారు.

ఈ ప్రక్రియనంతా దాటుకుని పరీక్ష ముగిసే సమయంలో నకిలీ అభ్యర్థిని గుర్తించామని చెప్పడం, అసలు అభ్యర్థి పరీక్ష ముగిసే సమయానికి పరీక్షా కేంద్రంలో ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్విజిలేషన్‌ డ్యూటీలను నియమించే సమయంలో అనేక ప్రలోభాలకు గురవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విద్యాశాఖకు చెందిన కొంతమంది తెలిపారు. తన స్నేహితుడు గత పదేళ్లుగా పదవ తరగతి పరీక్ష పాస్‌కాక పోవడంతో తన కోసం ఈ పని చేశానని పరీక్ష రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి చెబుతుంటే, ఎలాగైనా ఈసారి పరీక్ష పాస్‌ అవ్వాలని ఈ పని చేశామని అసలు విద్యార్థి చెప్పాడు. అయితే సరైన మార్గదర్శకం లేక విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నారు. ఇందుకు ఆస్కారమిచ్చిన వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించడానికి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh