online marketing

Saturday, March 19, 2011

రాపూరు సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో నిలువు దోపిడి

రాపూరు: రాపూరు సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం పోయిన ప్రజలను అక్కడి అధికారులు నిలువు దోపిడి చేస్తూన్నారని బాదితులు ఆరోపిస్తున్నారు. అప్పు చేసి భూములు కొనుగోలు చేసుకుని జీతం కూడబెట్టుకుని ఇంటి స్ధలం, ఇల్లు కొనుగోలు చేసి రిజిస్టేషన్‌ కోసం కార్యాలయం వద్దకు పోతే వ్యాలివేషన్‌ కన్న అధికంగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని తెలిపారు. కార్యాలయంలో ప్రవేటు వ్యక్తుల హవా కొనసాగడంతో రిజిస్ట్రేషన్‌ దారులు వారికి తలొగ్గక తప్పడం లేదని అంటున్నారు. దేవుడిని కలుసుకోవాలంటే పూజారి పర్మిషన్‌ కావాలన్నట్లు గా రిజిస్టార్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ఈ ప్రవేటు వ్యక్తుల సహకారం ఖచ్చితం గా కావాల్సిందేనని వీరు ఎంత అడిగితే అంత చెల్లించాల్సిందే అంటున్నారు. కార్యాలయం మూసివేసిన రాత్రులు సమయాలలో రహస్య ప్రాంతాలలో కూర్చుని పాత తేదిలతో రిజిస్ట్రేషన్‌ లు చేసి లక్షల రూపాయలు అక్కడి రిజిస్టార్‌ తీసుకుంటున్నట్లు గా సమాచారం. లైసెన్స్‌ పొందిన ఓ వ్యక్తి స్టాంపులు అమ్మకాలలో చేతి వాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ధర కన్న ఎక్కువ ధరకు అమ్ముకుని లబ్దిపొందుతున్నాడు. ప్రశ్నించిన వారికి ఆయన తాపిగా లైసెన్స్‌పొందిన ప్రవేటు వ్యక్తులం కాబట్టి ప్రతి స్టాంపుకు అదనంగా పది రూపాయలు వసూళ్ళు చేస్తున్నట్లు పార్టీలకు చెప్పడం విశేషం. గతంలో అవినీతి నిరోధక అధికారులు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పై దాడి చేసి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి అక్రమ దారుల పై కేసులు నమోదుచేసిన వారిలో మార్పు రాలేదని, అవినీతికి అలవాటు పడ్డ అధికారులను, లైసెన్స్‌ తో ఎక్కువ ధరకు స్టాంపులు విక్రయిస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకుని రాపూరు రిజిస్టార్‌ కార్యాలయాన్ని అవినీతి కూపం నుండి బైటకు తీసుకురావాలని బాదితులు జిల్లా అధికారులను, ఎసిబి అధికారులను కోరుతున్నారు. సబ్‌రిజిస్టార్‌ వివరణ ................ స్టాంపుల అమ్మకాలలో జరుగుతున్న అవకతవకలపై సబ్‌రిజిస్టార్‌ దృష్టికి తీసుకుని రాగా అటువంటిది ఏమి లేదంటూ స్టాంపులు అమ్ముతున్న వ్యక్తిని పిలిచి విచారించ గా స్టాంపుకు పది రూపాయలు అధనంగా తీసుకున్నట్లు సబ్‌రిజిస్టార్‌ ముందే చెప్పడం జరిగింది. ఇక మీదట అధిక ధరలకు స్టాంపులు విక్రయించవద్దని ఆయన అతనిని హెచ్చరించి పంపించడం జరిగింది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh