online marketing

Wednesday, December 16, 2009

ఆ బడికి.... నలుగురే విద్యార్థులు

ఆత్మకూరు:ప్రభుత్వం ఓ వైపు సంపూర్ణ అక్ష్యరాస్యత కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని వెన్నవాడ గ్రామ దళితవాడలో పాఠశాలను చూస్తే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.... వెన్నవాడ దళితవాడలోని సామాజిక భవనంలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. అక్కడ 20 కుటుంబాలు దళితులు జీవనం గడుపుతున్నారు. అయితే అక్కడ పని చేసే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయకపోవడమే నేడు ఆ పాఠశాల కేవలం నలుగురి విద్యార్థులకే పరిమితమైందని చెప్పవచ్చు. గతంలో పని చేసే ఉపాధ్యాయుడు సక్రమంగా పని చేయలేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం నూతన పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. స్థానికంగా ఓ వ్యక్తి భవనాన్ని నిర్మిస్తూ అనారోగ్యానికి గురై అక్కడ పని చేసే ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించారు.

అయినా ఆ భవనం పూర్తి కాలేదు. దీంతో కాలనీకి అవసరమైన సామాజిక భవనమే పాఠశాలగా మారింది. వర్షం వస్తే నిలిచే పరిస్థితి లేదు. కేవలం పది మంది విద్యార్థులు అక్కడ హాజరవుతున్నట్లు రికార్డులు చెబుతుంటే కేవలం ఐదుగురు ప్రతి రోజు బడికి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఉపాధ్యాయుడు అక్కడ పని చేస్తున్నాడు. విద్యార్థులు ఎందుకు లేరని ప్రశ్నిస్తే ఉండేది పది మందే, నేడు వచ్చింది ఐదుగురు మాత్రమేనని తాను వచ్చిన తర్వాత సామాజిక భవనంలో విద్యాబోధనకు అవసరమైన సమాచారాన్ని ఏర్పాటు చేయించానని ఉపాధ్యాయుడు వివరించారు. ప్రతి నెలలో విద్యాశాఖాధికారి కొన్ని పాఠశాలలను తనిఖీ చేయాలి. ఎమ్మార్పీలు కొన్నిపాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆ గ్రామంలో దళితకాలనీలో చిన్నారుల అగచాట్లను ఏ అధికారి పరిశీలించినట్లు లేదు.



నిరుపయోగంగా మరుగుదొడ్లు

అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి మరుగుదొడ్లు మంజూరయ్యాయి. పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే పాఠశాల భవనాన్ని పట్టించుకున్న దాఖల్లేవు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు సమీపంలో ఉండే పాఠశాల కనిపించకపోవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తుంది.


ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి

మండలంలో విద్యాబోధనపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. గతంలో అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు పనితీరు ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు. మరి వేలకువేలు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకుంటూ కేవలం నాలుగైదుగురికి చదువు చెబుతూ ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు. మరి ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది. ఇకనైనా స్పందించి అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయాలి. ఆ కాలనీలో చిన్నారులందరు బడికి వచ్చేలా అవగాహన కల్పించాలి. మరి ఎప్పటికి ఇలా జరుగుతుందో చూడాల్సి ఉంది

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh