online marketing

Tuesday, December 22, 2009

భూస్వాముల చేతిలో ప్రభుత్వ భూమి

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో సుమారు 300 ఎకరాలు ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన భూస్వాములు ఆక్రమించుకున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు కెఆర్‌.దాసరి ఆధ్వర్యంలో బల్లవోలు గ్రామస్తులు సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో చాలా కాలం నుండి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది. ఈ భూమిని అదే గ్రామంలో నివసిస్తున్న హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతులకు ఇవ్వాలని కోరారు. గతంలో ఆక్రమణ విషయమై సంబంధిత తహసిల్దార్‌కు తెలపగా ఆయన తలారిచే దండోరా వేయించిని ఫలితం లేకపోగా ఆక్రమణ చేశారన్నారు. ప్రభుత్వ భూమిని నిరుపేదలైన తమకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామవరపు బాబు ఎం.వెంకారామయ్య, కె.ఏడుకొండలు, ఆర్‌ .శివయ్య, ఎం.చిరంజీవి, కె.ఆదినారాయణ, సి.సుబ్బయ్య, అమర్‌నాధ్‌ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం పనిని ఇప్పించండిబాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో నివసిస్తూ గతంలో మధ్యాహ్న భోజన పథకం పనిని నిర్వహించిన ఎం. రాజేశ్వరికి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్‌ కార్యదర్శి ప్రజావిఙ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చినందున ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిని, మండలాధికారిని అనుమతితో విశ్రాంతి తీసుకున్నామన్నారు. ఆ సమయంలో పొదుపులక్ష్మి నాయకురాలైన ఒక మహిళకు ఆ పనిని ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తమ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని తమకు గతంలో తాము చేసిన పనిని ఇప్పించాలని కోరారు. కుటుంబాన్ని ఆదుకోండి గత ఆరు నెలల క్రితం విద్యుత్‌ వైర్లు తగిలి మృతి చెందిన రియాజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజింగ్‌ నగర అధ్యక్షులు ముజహిద్‌ సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. మృతి చెందిన కుటుంబం కూలి పని చేసుకుంటూ చాలీచాలని జీతంతో జరుగుబాటు కష్టంగా ఉందని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh