online marketing

Tuesday, December 8, 2009

తెలంగాణపై కాంగ్రెస్‌ ద్వందవైఖరి

నెల్లూరు : తెలంగాణ అంశంపై కాంగ్రెస్పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలుఏర్పడుతున్నాయని మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్పార్టీ ద్రోహం చేయడంవల్ల ప్రాంతీయ విభేదాలు ఏర్పడుతున్నాయని అన్నారు.

2004 ఎన్నికల్లో టిఆర్ఎస్తో చెట్టాపట్టాలు వేసి అధికారంలోకి వచ్చిన తరువాత అంశమే మరిచిపోయారని అన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్కు ముందు కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షురాలుసోనియాగాంధీ స్వయంగా తెలంగాణకు మద్దతుగా ప్రకటన చేశారని చెప్పారు. అయితే రెండో విడత ఎన్నికల పోలింగ్కువచ్చే సరికి వైఎస్రాజశేఖర్రెడ్డి తెలంగాణ ఏర్పాటుచేస్తే అక్కడి వెళ్లాలంటే పాస్పోర్టు తప్పనిసరిగా మారే దుస్థితిఆంధ్రావాసులకు తప్పదని హెచ్చరించడం ద్వారా కాంగ్రెస్పార్టీ దమననీతి అర్థం అవుతోందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని సోమిరెడ్డి చెప్పారు. ఎన్టీరామారావు 610 జివోను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేశారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పలు అభివృద్ధికార్యక్రమాలను చేపట్టారని ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు విగ్రహాలుధ్వంసం చేయడం తగదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలు సమర్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములని అన్నారు.

దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీజీని సైతం అవమానపరిచేవిధంగా ఆయన పేరును మార్చడం దురదృష్టకరమనిఅన్నారు. కాంగ్రెస్పార్టీలో ఒక వర్గమే ఇటువంటి విధానాలకు పాల్పడుతోందని పార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు చెన్నారెడ్డిని దింపేందుకు కాంగ్రెస్లో వ్యతిరేక వర్గం కూడా ఇటువంటి విధానాన్నిఅనుసరించిందని, ప్రస్తుతం కూడా రోశయ్యకు ముప్పు తీసుకురావడానికే తెలంగాణ ఉద్యమం వెనుక కాంగ్రెస్పార్టీకిచెందిన మరో వర్గం నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్రతెలుగుయువత అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి రమేష్రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
‌ ‌‌‌‌ ‌ ‌‌ ‌ ‌ ‌

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh